Nadendla Manohar: పెనుకొండలో ఆ 63 ఎకరాలు కియాకే కేటాయించారా?: నాదెండ్ల మనోహర్

  • విజయవాడలో నాదెండ్ల ప్రెస్ మీట్
  • భూ కేటాయింపుల అంశం ప్రస్తావన
  • కియాకి, సైంటిఫిక్ యూనిట్ కి సంబంధం ఏంటన్న నాదెండ్ల
  • ఈ యూనిట్ ఎక్కడ్నించి వచ్చిందంటూ విస్మయం
Nadendla Manohar press meet in Vijayawada

జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీఐఐసీ పెనుకొండలో భూమి కేటాయించిన అంశాన్ని ప్రస్తావించారు. ఆ భూమి మొత్తం కియాకే కేటాయించారా? అని ప్రశ్నించారు. ఇటీవలి కేబినెట్ సమావేశంలో కియా పేరిట ఏపీఐఐసీ నుంచి కేటాయించిన 63 ఎకరాల భూమి ఎవరికిచ్చారో చెప్పాలని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. 

కియా సైంటిఫిక్ ప్రాసెస్ యూనిట్ కోసం ఇచ్చినట్టు రాసి, ఆ మేరకు తీర్మానాన్ని ఆమోదించారని, అయితే ఆ విషయాన్ని ఎందుకు గోప్యంగా ఉంచారని ప్రశ్నించారు. అసలు, ఆటోమోటివ్ సంస్థ అయిన కియాకి, సైంటిఫిక్ ప్రాసెస్ యూనిట్ కు ఉన్న సంబంధం ఏమిటని నిలదీశారు. ఈ యూనిట్ ఎక్కడ్నించి వచ్చిందో అర్థం కావడంలేదని నాదెండ్ల విస్మయం వ్యక్తం చేశారు. ఈ సైంటిఫిక్ ప్రాసెస్ యూనిట్, కియా మోటార్స్ రెండూ ఒక్కటేనా...? అని సందేహాన్ని ఆయన వెలిబుచ్చారు.

More Telugu News