Rain: టీమిండియా, ఇంగ్లండ్ టెస్టుకు వర్షం అంతరాయం

  • బర్మింగ్ హామ్ లో మ్యాచ్
  • ఆట ప్రారంభమైన కాసేపటికే వాన 
  • అప్పటికి టీమిండియా స్కోరు 2 వికెట్లకు 53 రన్స్
  • ఓపెనర్లు గిల్, పుజారా అవుట్
  • రెండు వికెట్లు తీసిన ఆండర్సన్
Rain interrupts test between Team India and England

టీమిండియా, ఇంగ్లండ్ మధ్య బర్మింగ్ హామ్ లో ప్రారంభమైన ఐదో టెస్టు (రీషెడ్యూల్డ్) మ్యాచ్ కు వరుణుడు అంతరాయం కలిగించాడు. తొలి రోజు ఆట ఆరంభమైన కాసేపటికే వర్షం కురవడంతో మ్యాచ్ నిలిచిపోయింది. వర్షం జోరుగా కురియడంతో ఆటగాళ్లు మైదానాన్ని వీడారు. అప్పటికి టీమిండియా స్కోరు తొలి ఇన్నింగ్స్ లో 2 వికెట్ల నష్టానికి 53 పరుగులు. హనుమ విహారి 14, విరాట్ కోహ్లీ 1 పరుగుతోనూ ఆడుతున్నారు.

అంతకుముందు, టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ 27 పరుగులకే ఓపెనర్ శుభ్ మాన్ గిల్ (17) వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత కొద్దిసేపటికే మరో ఓపెనర్ ఛటేశ్వర్ పుజారా (13) కూడా అవుటవడంతో టీమిండియా రెండో వికెట్ చేజార్చుకుంది. ఈ రెండు వికెట్లు ఇంగ్లండ్ ప్రధాన పేసర్ జేమ్స్ ఆండర్సన్ ఖాతాలో చేరాయి. కాగా, వర్షం ఆగకపోవడంతో అంపైర్లు ముందుగానే లంచ్ విరామం ప్రకటించారు.

More Telugu News