Pakistan: పాకిస్థాన్ లో విద్యుత్ సంక్షోభం.. మొబైల్, ఇంటర్నెట్ సేవలు కూడా ఆగిపోయే పరిస్థితి!

  • దేశ వ్యాప్తంగా గంటల కొద్దీ విద్యుత్ కోతలు
  • అత్యవసర సేవలను కూడా నిలిపేసే అవకాశం
  • కరెంట్ సమస్యతో ఇప్పటికే పలు ఆంక్షలను విధించిన పాక్ ప్రభుత్వం
Electriciry crisis in Pakistan

మన దాయాది దేశం పాకిస్థాన్ లో విద్యుత్ సంక్షోభం మరింత ముదిరింది. దేశ వ్యాప్తంగా గంటల కొద్దీ విద్యుత్ కోతలను అమలు చేస్తున్నారు. కరెంట్ లేక అత్యవసర సేవలను కూడా నిలిపేసే పరిస్థితులు నెలకొన్నాయి. గంటల తరబడి విద్యుత్ కోతలు ఉండటంతో... మొబైల్, ఇంటర్నెట్ సేవలను నిలిపి వేయాల్సి వస్తుందని టెలికాం సంస్థలు హెచ్చరించాయని పాకిస్థాన్ నేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బోర్డు తెలిపింది. 

జులై నెలలో డిమాండ్ కు సరిపడా కరెంట్ ఉండకపోవచ్చని ఇంతకు ముందే పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ హెచ్చరించారు. ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రభుత్వం సాధ్యమైనంత వరకు ప్రయత్నాలు చేస్తుందని చెప్పారు. మరోవైపు విద్యుత్ సంక్షోభం కారణంగా మాల్స్, ఫ్యాక్టరీలు తదితరాలను తొందరగా మూసి వేయాలని పాక్ ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ అధికారుల పనివేళలను కూడా కుదించింది. రాత్రి పూట వేడుకలపై నిషేధం విధించింది.

More Telugu News