Enugu: రేపు ప్రేక్షకుల ముందుకు వస్తున్న 'ఏనుగు'

  • అరుణ్ విజయ్ హీరోగా ఏనుగు
  • సింగం ఫేమ్ హరి దర్శకత్వంలో చిత్రం
  • యాక్షన్ ఎంటర్టయినర్ జానర్ లో 'ఏనుగు'
Arun Vijay starred Enugu will hit theaters from tomorrow

అరుణ్ విజయ్ హీరోగా సింగం ఫేమ్ హరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఏనుగు. ఈ చిత్రం రేపు (జులై 1) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. యాక్షన్ ఎంటర్టయినర్ జానర్ లో వస్తున్న ఈ సినిమాపై చిత్రబృందం గట్టి నమ్మకంతో ఉంది. ఈ సినిమాలో అరుణ్ విజయ్ సరసన ప్రియాంక భవానీ శంకర్ కథానాయిక. ఇందులో సముద్రఖని, రాధిక, కేజీఎఫ్ ఫేమ్ రామచంద్రరాజు, యోగిబాబు తదితరులు నటించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించాడు. ఈ చిత్రాన్ని విఘ్నేశ్వర ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్ పై సీహెచ్. సతీష్ కుమార్ తెలుగులో విడుదల చేస్తున్నారు. 
.

More Telugu News