Ram: 'ది వారియర్' ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా బోయపాటి!

  • రామ్ తాజా చిత్రంగా రూపొందిన 'ది వారియర్'
  • కథానాయికగా అలరించనున్న కృతి శెట్టి
  • కీలకమైన పాత్రలో నదియా
  • ఈ నెల 14వ తేదీన సినిమా విడుదల
The Warrior Movie Update

రామ్ మరోసారి మాస్ యాక్షన్ కంటెంట్ తో రావడానికి రెడీ అవుతున్నాడు. ఆయన తాజా చిత్రంగా 'ది వారియర్' రూపొందింది. శ్రీనివాస చిట్టూరి భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకి లింగుసామి దర్శకత్వం వహించాడు. తెలుగు - తమిళ భాషల్లో ఈ సినిమాను ఈ నెల 14న విడుదల చేయనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు.

ఈ సినిమా నుంచి వచ్చిన 'బుల్లెట్' .. 'విజిల్' పాటలకు విశేషమైన స్పందన లభించింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను అనంతపూర్ లో నిర్వహించనున్నారు. బోయపాటి ముఖ్య అతిథిగా రేపు సాయంత్రం 5 గంటల నుంచి ఈ వేడుక మొదలుకానుంది. ఈ వేదికపై రాత్రి 7:57 నిమిషాలకు తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. 

ఇక అదే సమయంలో తమిళ ట్రైలర్ ను హీరో శివకార్తికేయన్ డిజిటల్ లాంచ్ చేయనున్నాడు. ఈ సినిమా టీమ్ ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ అందుకు సంబంధించిన పోస్టర్స్ ను వదిలారు. కృతి శెట్టి కథానాయికగా నటించిన ఈ సినిమాలో, నదియా .. అక్షరగౌడ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు..

More Telugu News