Nani: 'దసరా' సినిమా విషయంలో క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!

  • నాని హీరోగా రూపొందుతున్న 'దసరా'
  • ఈ సినిమాతో కొత్త దర్శకుడి పరిచయం 
  • నానితో కీర్తి సురేశ్ కి ఇది రెండో సినిమా 
  • అక్టోబర్లో గానీ .. జనవారిలోగాని రిలీజ్ చేసే ఛాన్స్
Dasara movie upadate

నాని హీరోగా 'దసరా' సినిమా రూపొందుతోంది. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకి, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు. 'నేను లోకల్' తరువాత నాని - కీర్తి సురేశ్ కలిసి నటిస్తున్న సినిమా ఇది. తెలంగాణ ప్రాంతంలోని ఒక మారుమూల గ్రామానికి చెందిన మాస్ యువకుడిగా ఈ సినిమాలో నాని కనిపించనున్నాడు.

నాని ఇంతవరకూ ఈ స్థాయి రఫ్ లుక్ తో కనిపించలేదు. అందువలన ఈ సినిమా ఫస్టు లుక్ వచ్చిన దగ్గర నుంచి అందరిలో ఆసక్తి పెరుగుతూపోతోంది. అయితే ఆర్థికపరమైన ఇబ్బందుల కారణంగా ఈ సినిమా షూటింగు ఆగిపోయిందనే ప్రచారం రెండు మూడు రోజులుగా జోరుగా జరుగుతోంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల స్పందించాడు. ఈ సినిమా షూటింగు అనుకున్నట్టుగానే జరుగుతోందనీ, ఆగిపోయిందంటూ ప్రచారం చేయడం కరెక్ట్ కాదని అన్నాడు. ఈ సినిమాపై అప్ డేట్స్ ను తాము ఇస్తూనే ఉంటామనీ .. అనవసరమైన పుకార్లను నమ్మవద్దని ఆయన కోరాడు. ఈ సినిమాను 'దసరా'కిగానీ .. సంక్రాంతికి గాని విడుదల చేయనున్నారు.

More Telugu News