Nara Lokesh: ఐదుగురు నిరుపేదలు సజీవ దహనమైతే.. కట్టుకథలు చెప్పిస్తున్నారు: నారా లోకేశ్

  • శ్రీసత్యసాయి జిల్లాలో హైటెన్షన్ తీగలు పడి తగలబడిన ఆటో
  • విద్యుత్ శాఖ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమన్న నారా లోకేశ్
  • మృతుల కుటుంబాలకు మెరుగైన పరిహారం చెల్లించాలని డిమాండ్
Nara Lokesh fires on YSRCP govt

శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం చిల్లకొండ్యపల్లి వద్ద ఆటోపై హైటెన్షన్ విద్యుత్ తీగలు పడిన ఘటనలో ఐదుగురు సజీవదహనమైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు. మృతులకు నివాళి అర్పిస్తున్నానని చెప్పారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం మెరుగైన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. 

తేనెటీగల వల్ల రథం తగలబడటం, ఎలుకలు మందు తాగడం, కుక్కలు తరిమితే భయపడిన దొంగలు కోర్టులో కాకాని కేసు ఆధారాలు ఎత్తుకుపోవడం, ఉడత వల్ల హై టెన్షన్ వైర్ తెగడం వంటివన్నీ జగన్ నాటక రెడ్డి పాలనలోనే జరుగుతాయని మండిపడ్డారు. ఇంకా నయం.. కోతల్లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెప్పలేదని ఎద్దేవా చేశారు. ఐదుగురు నిరుపేదలు సజీవ దహనమైతే, కనీస విచారణ జరపకుండానే అధికారులతో కట్టుకథల కహానీలు చెప్పించడం వైసీపీ సర్కారుకి అలవాటైపోయిందని అన్నారు.

More Telugu News