TDP: 'మినీమహానాడు' విషయమై గుడివాడ‌, మ‌ద‌న‌ప‌ల్లి తెలుగు త‌మ్ముళ్ల వాదులాట‌... మ‌ద‌న‌ప‌ల్లి త‌మ్ముళ్ల‌కే ఓటేసిన చంద్ర‌బాబు

  • వ‌ర్షం కార‌ణంగా గుడివాడ మినీ మ‌హానాడు వాయిదా
  • జులై 6న మ‌ద‌న‌ప‌ల్లిలో మినీ మ‌హానాడుకు ముందే నిర్ణ‌యం
  • అదే రోజున గుడివాడ‌లో కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తామ‌న్న నేత‌లు
  • ఇప్ప‌టికే ఏర్పాట్లు చేశామన్న మ‌ద‌న‌ప‌ల్లి నేత‌లు
chandrababu agrees to attend madanapalli mini mahanadu on july 6th

టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు జిల్లాల ప‌ర్య‌ట‌న‌కు సంబంధించి బుధ‌వారం జ‌రిగిన స‌మావేశంలో ఓ కీల‌క స‌న్నివేశం చోటుచేసుకుంది. జులై 6న గుడివాడ ప‌ర్య‌ట‌న‌కు రావాలంటూ ఆ ప్రాంతానికి చెందిన తెలుగు త‌మ్ముళ్లు ప‌ట్టుబ‌డితే... అదేమీ కుద‌ర‌దు మ‌ద‌న‌ప‌ల్లికే రావాలంటూ ఆ ప్రాంత నేత‌లు ప‌ట్టుబ‌ట్టారు. 

బుధ‌వారం చంద్ర‌బాబు హాజ‌రు కావాల్సిన గుడివాడ మినీ మ‌హానాడు వ‌ర్షం కార‌ణంగా వాయిదా ప‌డిన సంగతి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో జులై 6న గుడివాడ‌లో మినీ మ‌హానాడును నిర్వ‌హిస్తామ‌ని, ఆ స‌భ‌కు హాజ‌రు కావాల‌ని గుడివాడ నేత‌లు చంద్ర‌బాబును కోరారు. అయితే ముందుగా నిర్ణ‌యించిన షెడ్యూల్ ప్ర‌కారం మ‌ద‌న‌ప‌ల్లిలో జులై 6న మినీ మ‌హానాడుకు ఏర్పాట్లు చేశామ‌ని... ఆ స‌భ‌కే రావాలంటూ చంద్ర‌బాబును మ‌ద‌న‌ప‌ల్లి నేత‌లు కోరారు.

ఇరు వ‌ర్గాల నేత‌ల వాద‌న‌ల‌ను విన్న చంద్ర‌బాబు... ముందుగా నిర్ణ‌యించిన మేర‌కు మ‌ద‌న‌ప‌ల్లి మినీ మ‌హానాడుకే హాజ‌రు కానున్న‌ట్లు ప్ర‌క‌టించారు. గుడివాడ‌లో మ‌రో రోజున మినీ మ‌హానాడును నిర్ణ‌యిద్దామ‌ని, దానికి కూడా తాను హాజ‌ర‌వుతాన‌ని చంద్ర‌బాబు చెప్పారు. దీంతో గుడివాడ నేత‌లు కూడా స‌మ్మ‌తించారు.

More Telugu News