Ram: 'ది వారియర్' ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కి వేదిక ఖరారు!

  • తెలుగు - తమిళ భాషల్లో రూపొందిన 'ది వారియర్'
  • లింగుసామి దర్శకత్వంలో నటించిన రామ్ 
  • కీలకమైన పాత్రలో కనిపించనున్న నదియా
  • అనంతపూర్ లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ 
  • జులై 14వ తేదీన సినిమా రిలీజ్
The Warrior Movie Update

రామ్ హీరోగా లింగుసామి దర్శకత్వంలో 'ది వారియర్' సినిమా రూపొందింది. శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమాలో రామ్ జోడీగా కృతి శెట్టి అలరించనుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. ఇప్పటికే 'బుల్లెట్ ' .. 'విజిల్' పాటలకు అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ రెండు పాటల బీట్ ఒక రేంజ్ లో యూత్ కి నచ్చేసింది. 

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. జులై 1వ తేదీన సాయంత్రం 7:57 నిమిషాలకు ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్టు నిన్ననే చెప్పారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఎక్కడ జరగనున్నది కొంతసేపటి క్రితం ఎనౌన్స్ చేశారు. అనంతపూర్ .. అనంతలక్ష్మి  ఇంజనీరింగ్ కాలేజ్ లో ఈ వేడుక జరగనుంది. 

ఆది ఈ సినిమాలో ప్రతినాయకుడిగా నటించాడు. అక్షర గౌడ .. నదియా ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. దర్శకుడు భారతీరాజా ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నారు. 'రెడ్' ఫ్లాప్ తరువాత తెలుగు - తమిళ భాషల్లో  రామ్ చేసిన ఈ సినిమా ఆయనకి హిట్ ఇస్తుందేమో చూడాలి.

More Telugu News