Kamal Haasan: డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో 'విక్రమ్' .. స్ట్రీమింగ్ డేట్ ఖరారు!

  • ఈ నెల 3వ తేదీన థియేటర్లకు వచ్చిన 'విక్రమ్'
  • విడుదలైన ప్రతి చోటున విజయవిహారం
  • వివిధ భాషల్లో రికార్డుస్థాయి వసూళ్లు  
  • వచ్చేనెల 8 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ 
Vikram movie update

కమలహాసన్ హీరోగా ఆయన సొంత నిర్మాణంలో 'విక్రమ్' సినిమా రూపొందింది. ఈ నెల 3వ తేదీన ఈ సినిమా థియేటర్లకు వచ్చింది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, విడుదలైన ప్రతి భాషలో వసూళ్ల వర్షాన్ని కురిపించింది. ఆ తరువాత వచ్చిన సినిమాలేవీ ఈ వసూళ్లపై ప్రభావం చూపలేకపోయాయి.

ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసే ప్రేక్షకులు చాలామంది ఉన్నారు. జులై 8వ తేదీ నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్టు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు అధికారిక ప్రకటన చేశారు. ఎన్ని భాషల్లో సినిమా విడుదలైందో అన్ని భాషల్లోను ఓటీటీ ద్వారా పలకరించనుంది.

థియేటర్లను దడదడలాడించిన ఈ సినిమా, ఓటీటీ నుంచి ఏ స్థాయి రెస్పాన్స్ ను రాబడుతుందో చూడాలి. విజయ్ సేతుపతి .. ఫహాద్ ఫాజిల్ ఈ సినిమాలో విలక్షణమైన పాత్రలను పోషించారు. ప్రతినాయకుడిగా సూర్య తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉందనే విషయాన్ని దర్శకుడు హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే..

More Telugu News