India: ఒకే రోజు 14 వేలు దాటిన కరోనా కేసులు.. లక్షకు చేరుకున్న యాక్టివ్ కేసులు!

  • గత 24 గంటల్లో 14,506 పాజిటివ్ కేసులు
  • కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 11,574
  • దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 99,602
India corona updates

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 4.33 లక్షల మందికి కొవిడ్ పరీక్షలను నిర్వహించగా... 14,506 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అంతకు ముందు రోజు 11,793 కేసులు రావడం గమనార్హం. ఇదే సమయంలో 11,574 మంది కరోనా నుంచి కోలుకోగా.. 30 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు దేశంలో యాక్టివ్ కేసులు లక్షకు చేరువయ్యాయి. ప్రస్తుతం దేశంలో 99,602 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,34,33,345కి పెరిగింది. వీరిలో 4,28,08,666 మంది కోలుకోగా.. 5,25,077 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో పాజిటివిటీ రేటు 3.38 శాతంగా, రికవరీ రేటు 98.56 శాతంగా, మరణాల రేటు 1.21 శాతంగా, క్రియాశీల రేటు 0.23 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 197.46 కోట్ల డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న ఒక్కరోజే 13,44,788 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.

More Telugu News