ONGC Helicopter: అరేబియా సముద్రంలో అత్యవసరంగా దిగిన ఓఎన్జీసీ హెలికాప్టర్

  • తొమ్మిది మందితో ప్రయాణిస్తున్న చాపర్
  • ముంబయి తీరానికి సమీపంలో అత్యవసర పరిస్థితి
  • సహాయచర్యలకు ఉపక్రమించిన కోస్ట్ గార్డ్, ఓఎన్జీసీ
  • అందరినీ కాపాడిన వైనం
  • నలుగురికి ఆసుపత్రిలో చికిత్స
ONGC Helicopter emergency landing in Arabian Sea near Mumbai shore

తొమ్మిది మందితో ప్రయాణిస్తున్న ఓఎన్జీసీ (ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కమిషన్) హెలిక్టాపర్ ఒకటి ప్రమాదం నుంచి తప్పించుకుంది. ముంబయికి పశ్చిమంగా 60 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ఘటన జరిగింది. ఈ హెలికాప్టర్ ముందుకు కొనసాగలేని పరిస్థితుల్లో అరేబియా సముద్రంలోని సాగర్ కిరణ్ ఆఫ్ షోర్ రిగ్ వద్ద అత్యవసరంగా కిందికి దిగింది. ఆ సమయంలో ఇద్దరు పైలెట్లు, ఏడుగురు ప్రయాణికులు ఉన్నారు. 

వీరిని కాపాడేందుకు ఓ కోస్ట్ గార్డ్ విమానం రంగంలోకి దిగింది. సరకు రవాణా నౌక మాలవ్య-16ను కూడా సహాయక చర్యల కోసం మళ్లించారు. లైఫ్ బోట్ల సాయంతో హెలికాప్టర్ లోని వారిని వెలుపలికి తరలించారు. కాగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని ముంబయిలోని ఓఎన్జీసీ ఆసుపత్రికి తరలించారు.

More Telugu News