Ukraine: ఈ ఏడాది చివరికైనా యుద్ధం ముగిసేలా చూడండి: జీ-7 దేశాధినేతలకు జెలెన్ స్కీ విన్నపం

  • నాలుగు నెలలు గడుస్తున్నా ఆగని ఉక్రెయిన్ పై రష్యా దాడి
  • జీ-7 శిఖరాగ్ర సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించిన జెలెన్ స్కీ
  • రష్యాలపై ఆంక్షలను తీవ్రతరం చేయాలని కోరిన ఉక్రెయిన్ అధ్యక్షుడు
Ukraine president Zelensky requests G7 countries to pressure Russia to stop war

ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర మొదలై నాలుగు నెలలు దాటింది. నెలలు గుడుస్తున్నా యుద్ధం ఇప్పట్లో ముగిసే పరిస్థితి ఏమాత్రం కనిపించడం లేదు. మరోవైపు ఉక్రెయిన్ మాత్రం రోజురోజుకూ మరింత ధ్వంసమవుతూనే ఉంది. ప్రతి రోజు ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో జీ-7 దేశాధినేతలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఒక విన్నపం చేశారు. 

ప్రస్తుతం జర్మనీలో జీ-7 శిఖరాగ్ర సమావేశం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెలెన్ స్కీ ప్రసంగించారు. పోరాటం కొనసాగుతున్న నేపథ్యంలో తమ బలగాలకు యుద్ధ పరిస్థితులు మరింత కఠినంగా మారుతున్నాయని ఆయన అన్నారు. యుద్ధ తీవ్రత పెరుగుతోందని చెప్పారు. ఈ ఏడాది చివరికైనా యుద్ధం ముగిసేలా శాయశక్తులా కృషి చేయాలని కోరారు. రష్యాపై ఆంక్షలను తీవ్రతరం చేయడంతో పాటు... వివిధ మార్గాల ద్వారా ఆ దేశంపై ఒత్తిడి తీసుకురావాలని విన్నవించారు.

More Telugu News