Dulquer Salmaan: 'సీతా రామం' టీజర్ రిలీజ్!

  • హను రాఘవపూడి నుంచి మరో విభిన్న ప్రేమకథా చిత్రం 
  • దుల్కర్ జోడీగా నటించిన మృణాళిని ఠాకూర్ 
  • కీలకమైన పాత్రలో రష్మిక 
  • ఆగస్టు 5వ తేదీన సినిమా విడుదల
Sita Ramam Teaser Release

దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా 'సీతా రామం' సినిమా రూపొందింది. అశ్వనీదత్ - స్వప్న కలిసి ఈ సినిమాను నిర్మించారు. హను రాఘవపూడి ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. కాశ్మీర్ ప్రాంతంలో పనిచేసే సిపాయిగా ఈ సినిమాలో దుల్కర్ కనిపించనున్నాడు. విభిన్నమైన ప్రేమకథా చిత్రంగా నిర్మితమైన ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ ను రిలీజ్ చేశారు.

తనవారంటూ ఎవరూ లేని ఒంటరితనంతో కథానాయకుడు బాధపడుతూ ఉంటే, అతని భార్య సీతామహాలక్ష్మిని అంటూ ఒక యువతి నుంచి ఉత్తరం వస్తుంది. ఆ ఉత్తరం ఎవరు రాశారనేది అతనికి తెలియదు .. సీత ఎవరనేది తెలియదు. అప్పుడు అతను ఏం చేశాడనేదే కథ అనే విషయం టీజర్ ద్వారా తెలుస్తోంది.

'యుద్ధంతో రాసిన ప్రేమకథ' అనే ట్యాగ్ లైన్ ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఈ సినిమాలో రష్మిక ఒక కీలకమైన పాత్రను పోషించింది. ఆమె పాత్ర ఏమిటనేది కూడా ఉత్కంఠను పెంచుతోంది. విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఆగస్టు 5వ తేదీన తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ ఈ సినిమాను విడుదల చేస్తున్నారు.

More Telugu News