Andhra Pradesh: గ్రామ‌, వార్డు స‌చివాల‌య ఉద్యోగుల‌కు తీపి క‌బురు చెప్పిన ఏపీ ప్ర‌భుత్వం

  • రెండేళ్లు స‌ర్వీసు పూర్తి చేసుకున్న వారికి ప్రొబేష‌న్ డిక్ల‌రేష‌న్‌
  • అర్హ‌త ప‌రీక్ష పాసై ఉండాలంటూ కండీష‌న్‌
  • డిక్ల‌రేష‌న్ బాధ్య‌త‌ల‌ను జిల్లా క‌లెక్ట‌ర్లకు అప్ప‌గిస్తూ ఉత్త‌ర్వులు
  • ప్రొబేష‌న్ పూర్తి అయిన వారి వేత‌నాలు పెంచుతూ మ‌రో కీల‌క నిర్ణ‌యం
ap government issues oreders to probation decleration to villaga and ward sachivalaya employees

ఏపీ వ్యాప్తంగా కొన‌సాగుతున్న గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల్లో ప‌నిచేస్తున్న ల‌క్ష‌లాది మంది ఉద్యోగుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం తీపి క‌బురు చెప్పింది. స‌చివాలయ ఉద్యోగుల ప్రొబేష‌న్ డిక్ల‌రేష‌న్‌కు సంబంధించి ప్రభుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఉద్యోగుల ప్రొబేష‌న్ డిక్లరేష‌న్‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తూ శ‌నివారం ఉత్త‌ర్వులు జారీ చేసింది. అంతేకాకుండా ప్రొబేష‌న్ పూర్తి అయిన వారికి జీత భ‌త్యాల‌ను కూడా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

రెండేళ్ల స‌ర్వీసు పూర్తి చేసుకొని పరీక్ష ఉత్తీర్ణులైన వారందరికీ ప్రొబేషన్‌ డిక్లరేషన్‌ చేసే అధికారాన్ని కలెక్టర్లకు అప్పగిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. సచివాలయ ఉద్యోగులకు పే స్కేల్‌ను ఖ‌రారు చేస్తూ కూడా ప్రభుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది పంచాయతీ సెక్రటరీ, వార్డు సెక్రటరీల పే స్కేల్‌ను రూ.23,120 నుంచి రూ.74,770కు, ఇతర సచివాలయ ఉద్యోగుల పే స్కేల్‌ను రూ.22,460 నుంచి రూ.72,810 పెంచుతూ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

More Telugu News