Raghu Rama Krishna Raju: రఘురామకృష్ణరాజు వ్యాజ్యాన్ని కొట్టేసిన హైకోర్టు

  • ఏపీ బెవరేజెస్ సవరణ చట్టాలను రద్దు చేయాలంటూ రఘురాజు పిటిషన్
  • పిల్ ను విచారించిన చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం
  • ఇంకా అందని తీర్పు కాపీ
AP High Court rejects Raghu Rama Krishna Raju petition

ఏపీ హైకోర్టులో వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుకు ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టివేసింది. మద్యం ద్వారా వస్తున్న ఆదాయాన్ని ప్రత్యేక మార్జిన్ మనీ పేరుతో రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ కు మళ్లించి... ఆ మొత్తాన్ని ఆదాయంగా చూపి, ఆర్థిక సంస్థల ద్వారా రుణాలు పొందడాన్ని సవాల్ చేస్తూ రఘురాజు పిల్ వేశారు. 

ఏపీ మద్యం చట్టానికి సవరణ చేస్తూ తీసుకొచ్చిన సవరణ చట్టాలను రద్దు చేయాలని తన పిటిషన్ లో రఘురాజు కోరారు. ఈ పిల్ ను విచారించిన హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులుతో కూడిన ధర్మాసనం ఆ వ్యాజ్యాన్ని కొట్టివేసింది. హైకోర్టు తీర్పు కాపీ ఇంకా రాకపోవడంతో... ఏ కారణాలతో పిల్ ను కొట్టివేసిందనే విషయం తెలియరాలేదు.

More Telugu News