Nitin Gadkari: భారత్ లో కార్లకు ఇక ఇక్కడే క్రాష్ టెస్ట్: నితిన్ గడ్కరీ

  • ప్రకటించిన కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ
  • భారత్ ఎన్ సీఏపీ ఏర్పాటుకు అధికారిక అనుమతి
  • భారత్ లో తయారయ్యే కార్లకు ఇక్కడే రేటింగ్
Nitin Gadkari approves Bharat NCAP to share safety ratings of Indian cars

భారత ఆటోమొబైల్ కంపెనీలకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శుభవార్త చెప్పారు. కార్లను క్రాష్ టెస్ట్ కోసం గ్లోబల్ ఎన్ సీఏపీ టెస్టింగ్ కోసం పంపాల్సిన అవసరం ఇక మీదట ఉండబోదన్నారు. త్వరలోనే భారత్ ఎన్ సీఏపీ కార్యకలాపాలు మొదలు పెడుతుందని మంత్రి చెప్పారు.

‘న్యూ కార్ అసెస్ మెంట్ ప్రొగ్రామ్’ నే ఎన్ సీఏపీగా పిలుస్తుంటారు. కొత్త కార్లకు సంబంధించి సామర్థ్య పరీక్షలు నిర్వహించి రేటింగ్ ఇవ్వడం ఎన్ సీఏపీ విధి. భారత్ ఎన్ సీఏపీకి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసినట్టు మంత్రి గడ్కరీ ట్విట్టర్ వేదికగా తెలిపారు. 

‘‘భారత్ ఎన్ సీఏపీ ఏర్పాటుకు సంబంధించి ముసాయిదా నోటిఫికేషన్ నకు ఇప్పుడే ఆమోదం తెలిపాను. క్రాష్ పరీక్షల్లో చూపించిన పనితీరు ఆధారంగా వాహనాలకు రేటింగ్ లు ఇస్తాం. స్టార్ రేటింగ్ ల ఆధారంగా కస్టమర్లు సురక్షితమైన కారును ఎంపిక చేసుకోవడానికి వీలుంటుంది. దీంతో సురక్షితమైన కార్లను తయారు చేసే విషయంలో కంపెనీల మధ్య ఆరోగ్యకర పోటీని ప్రోత్సహించినట్టు అవుతుంది. అంతేకాదు భారత వాహనాల ఎగుమతి సామర్థ్యాలను కూడా పెంచుతుతుంది’’ అని మంత్రి ట్వీట్ చేశారు.

More Telugu News