Cricket: ప్రపంచంలో ఇలాంటి బౌలింగ్​ను ఎప్పుడూ చూసి ఉండరు!

  • గమ్మత్తయిన బౌలింగ్ యాక్షన్ తో వార్తల్లోకి ఇంగ్లండ్ విలేజ్ క్రికెటర్ 
  • క్రీజు దగ్గరే రనప్ చేసి బాల్ వేస్తున్న వైనం
  • నెట్ వైరల్ గా అతని బౌలింగ్ వీడియో
bizarre bowling action in  cricket

సాధారణంగా బౌలర్లు పరుగెత్తుకుంటూ వచ్చి బౌలింగ్ చేస్తుంటారు. ఫాస్ట్ బౌలర్లు అయితే ఎక్కువ దూరం నుంచి పరుగెత్తుకుంటూ వస్తారు. స్పిన్నర్లయితే తక్కువ దూరం నుంచే వచ్చి వేస్తారు. దీన్ని రనప్ అంటారు. ఒక్కో బౌలర్ రనప్ ఒక్కోలా ఉంటుంది. అలాగే, ప్రతి ఒక్కరి బౌలింగ్ యాక్షన్ వేర్వేరుగా ఉంటుంది. 

టీమిండియాలో అయితే జస్ ప్రీత్ బుమ్రా బౌలింగ్ యాక్షన్ అందరికంటే వైవిధ్యంగా ఉంటుంది. తక్కువ రనప్ తో వచ్చి ఒక చేతిని ముందుకు పెట్టి బౌలింగ్ చేస్తుంటాడతను. శ్రీలంక దిగ్గజ బౌలర్ లసిత్ మలింగ, పాకిస్థాన్ పేసర్ సొహైల్ తన్వీర్ యాక్షన్ కూడా గమ్మత్తుగా ఉండేది. 

వీళ్లందరినీ మించేలా.. అసలు ప్రపంచంలో ఇప్పటి వరకు చూడని బౌలింగ్ యాక్షన్ తో వార్తల్లోకి వచ్చాడు ఓ క్రికెటర్. అతని పేరు జార్జ్ మెక్ మెనెమీ. తను ఇంగ్లండ్ లో విలేజ్ క్రికెట్ ఆడుతుంటాడు. అతని బౌలింగ్ శైలి చూసి క్రికెటర్లతో పాటు ఫ్యాన్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు. 

జార్జ్ కుడి చేతి వాటం స్లో బౌలర్. అందరిలా పరుగెత్తుకొని రాకుండా క్రీజు దగ్గరే రనప్ చేయడం అతని ప్రత్యేకత. ముందుగా ఎడమ చేతిని పైకి లేపుతాడు. ఉన్న చోటనే రనప్ చేస్తున్నట్టు చేసి బంతి వేసి మైకాళ్లపై చేతులు పెట్టి చూస్తుంటాడు. తన బౌలింగ్ వీడియోను జార్జ్ స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇప్పుడు ఈ వీడియో నెట్లో హల్చల్ చేస్తోంది.

More Telugu News