Gopichand: మెగాస్టార్ ముఖ్య అతిథిగా 'పక్కా కమర్షియల్' ప్రీ రిలీజ్ ఈవెంట్!

  • మారుతి నుంచి 'పక్కా కమర్షియల్'
  • గోపీచంద్ సరసన నాయికగా రాశి ఖన్నా 
  • ఈ నెల  26వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ 
  • వచ్చేనెల 1వ తేదీన సినిమా విడుదల
Pakka Commercial Movie Update

గోపీచంద్ - రాశి ఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో 'పక్కా కమర్షియల్' రూపొందింది. గీతా ఆర్ట్స్ 2- యూవీ వారు ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో గోపీచంద్ - రాశి ఖన్నా ఇద్దరూ కూడా లాయర్లుగా కనిపించనున్నారు. మారుతి మార్కు కామెడీ .. గోపీచంద్ తరహా యాక్షన్ ఈ సినిమాలో ఉంటుందని చెప్పారు. 

జేక్స్ బిజోయ్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. 'అందాల రాశి' పాటకి మంచి రెస్పాన్స్ వచ్చింది. వచ్చేనెల 1వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తేదీని ఖరారు చేశారు. ఈ నెల 26వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహిస్తున్నట్టుగా ప్రకటించారు. 

ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా చిరంజీవి రానున్నట్టుగా చెబుతూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు. ఈ సినిమాపై అంతకంతకూ అంచనాలు పెరుగుతూ వచ్చాయి. సత్యరాజ్ .. అనసూయ పాత్రలు ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు. గోపీచంద్ ఆశిస్తున్న హిట్ ఈ సినిమాతో పడుతుందేమో చూడాలి.

More Telugu News