Sensex: నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు

  • 709 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 225 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 5 శాతానికి పైగా నష్టపోయిన టాటా స్టీల్ షేర్ విలువ
markets ends in losses

నిన్న భారీ లాభాలను మూటకట్టుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో మార్కెట్లు నష్టపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 709 పాయింట్లు నష్టపోయి 51,822కి పడిపోయింది. నిఫ్టీ 225 పాయింట్లు కోల్పోయి 15,413కి దిగజారింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టీసీఎస్ (0.31%), హిందుస్థాన్ యూనిలీవర్ (0.18%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (0.05%), మారుతి (0.01%). 

టాప్ లూజర్స్:
టాటా స్టీల్ (-5.24%), విప్రో (-3.29%), రిలయన్స్ (-3.07%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.67%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-2.61%).

More Telugu News