Sensex: దూసుకుపోయిన స్టాక్ మార్కెట్లు

  • 934 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 288 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 5.92 శాతం లాభపడ్డ టైటాన్ షేర్ విలువ
Markets ends in profits

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు దూసుకుపోయాయి. వరుసగా రెండో రోజు లాభాలను నమోదు చేశాయి. అంతర్జాతీయంగా సానుకూలతలు ఉండటం ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచింది. దీంతో పాటు దేశంలో నిన్న కరోనా కేసుల సంఖ్య తగ్గడం కూడా ప్రభావం చూపింది.

ఈరోజు ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు చివరి వరకు అదే ధోరణిని ప్రదర్శించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 934 పాయింట్లు లాభపడి 52,532కి చేరుకుంది. నిఫ్టీ 288 పాయింట్లు పెరిగి 15,639కి ఎగబాకింది. ఈరోజు అన్ని సూచీలు లాభాలను చవిచూశాయి. ఆయిల్ అండ్ గ్యాస్ సూచీ 5.96 శాతం, ఎనర్జీ సూచీ 4.95 శాతం లాభపడ్డాయి.   

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టైటాన్ (5.92%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (3.79%), టీసీఎస్ (3.17%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (2.87%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (2.70%). 

బీఎస్ఈ సెన్సెక్స్ లో కేవలం నెస్లే ఇండియా (-0.26%) మాత్రమే నష్టపోయింది.

More Telugu News