SKM: ‘అగ్నిపథ్’కు వ్యతిరేకంగా ఆందోళనకు సిద్ధమైన రైతు సంఘాలు..24న దేశవ్యాప్త నిరసన

  • జిల్లా, తహసీల్దార్ కార్యాలయాల్లో శుక్రవారం నిరసనలు
  • యువత, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరిన ఎస్‌కేఎం
  • ఈ నెల 30న నిరసనలకు పిలుపునిచ్చిన బీకేయూ
SKM and BKU plan to organise nationwide protests on June 24 and 30

త్రివిధ దళాల్లో నియామకం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న వేళ రైతు సంఘాలు కూడా స్పందించాయి. ఈ పథకానికి వ్యతిరేకంగా ఈ నెల 24న దేశవ్యాప్త నిరసనలకు సంయుక్త కిసాన్ మోర్చా (SKM) పిలుపునిచ్చింది. ఎస్‌కేఎం 40 రైతు సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తోంది. హర్యానాలోని కర్నాల్‌లో జరిగిన సంఘం సమన్వయ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు రైతు నేత రాకేష్ తికాయత్ తెలిపారు. 

జిల్లా, తహసీల్దార్ కార్యాలయాల్లో శుక్రవారం జరిగే నిరసన ప్రదర్శనలకు యువత, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. భారతీయ కిసాన్ యూనియన్(BKU) కూడా నిరసనల్లో పాల్గొంటుందన్నారు. కాగా, రాకేష్ తికాయత్ నేతృత్వంలోని బీకేయూ కూడా అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా ఈ నెల 30న నిరసనలకు పిలుపునిచ్చింది.

More Telugu News