Junior NTR: ఎన్టీఆర్ సినిమా కోసం భారీ సెట్ .. ఇంటర్వెల్ బ్యాంగ్ లో బ్లాస్ట్?

  • ఎన్టీఆర్ 30వ సినిమాకి సన్నాహాలు 
  • వచ్చేనెల నుంచి రెగ్యులర్ షూటింగ్ 
  • యాక్షన్ కి పెద్దపీట వేస్తున్న కొరటాల 
  • వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు  
Koratala movie update

ఎన్టీఆర్ తన నెక్స్ట్ మూవీ కోసం రెడీ అవుతున్నాడు. కెరియర్ పరంగా ఆయనకి ఇది 30వ సినిమా. కొరటాల శివ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. వచ్చేనెలలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని అంటున్నారు. ఇది కొరటాల మార్క్ తో సాగే మాస్ యాక్షన్ ఎంటర్టయినర్ అనే అంటున్నారు.  

ఈ సినిమా కోసం హైదరాబాదులో భారీస్థాయిలో ఒక ప్రత్యేకమైన సెట్ వేస్తున్నారట. ఆల్రెడీ పూర్తయిపోయిందని అంటున్నారు. ఈ సెట్ లో భారీ యాక్షన్ ఎపిసోడ్ ను ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఆ యాక్షన్ సీన్ చివర్లోనే ఈ సెట్ ను బ్లాస్ట్ చేయనున్నారని అంటున్నారు . ఇదే తెరపై ఇంటర్వెల్ బ్యాంగ్ గా వస్తుందని సమాచారం. 

ఇక ఈ సినిమాలో సముద్రగర్భంలో జరిగే ఫైట్ ను డిజైన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ ఎపిసోడ్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటుందని అంటున్నారు. ఈ రెండు యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

More Telugu News