COVID19: పెరుగుతున్న కరోనా కేసులు.. దేశంలో కొత్తగా 12,781 కేసులు

  • 24 గంటల్లో కోలుకున్న 8537 మంది
  • వైరస్ తో 18 మంది మృతి
  • ప్రస్తుత యాక్టివ్ కేసులు 76,700
India reports 12 781 new cases

భారత్ లో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రోజూ పదివేల మందికి పైగా వైరస్ బారిన పడుతున్నారు. గడచిన 24 గంటల్లో కొత్తగా 12, 781 మందికి వైరస్ సోకినట్టు తేలింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 76,700కు చేరుకుంది. యాక్టివ్ కేసుల శాతం 0.18గా ఉంది. 

అదే సమయంలో వైరస్ వల్ల నిన్న 18 మంది మృతి చెందారు. దాంతో, మొత్తం మృతుల సంఖ్య 5,24,873కు చేరుకుంది. కోవిడ్ మరణాల శాతం 1.21 గా నమోదైంది. ఇక గడచిన 24 గంటల్లో 8,537 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దేశంలో ఇప్పటిదాకా కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 4 కోట్ల 27లక్షల 7,900కి చేరుకుంది. రికవరీ రేటు 98.61 శాతంగా ఉంది. 

 కొన్ని రోజులుగా కొత్త కేసుల కంటే రోజువారీ కోలుకున్న వారి సంఖ్య తగ్గడం గమనార్హం. ఇక,  నిన్న 2,80,136 మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చారు. దాంతో, దేశంలో ఇప్పటిదాకా అందించిన కరోనా డోసుల సంఖ్య 196 కోట్ల 18 లక్షల 66, 707గా నమోదైంది.

More Telugu News