YS Sharmila: పాదయాత్రలో ఆటో నడిపిన షర్మిల

  • 96వ రోజుకు చేరుకున్న షర్మిల పాదయాత్ర
  • ఆటో నడిపి అందరినీ ఆకట్టుకున్న షర్మిల
  • డ్రైవరన్నల కష్టానికి ఫలితం దక్కే రోజు దగ్గర్లోనే ఉందని వ్యాఖ్య
YS Sharmila drives auto

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర 96వ రోజుకు చేరుకుంది. ఈరోజు సాయంత్రం ఖమ్మం పాత బస్టాండ్ దగ్గర జరిగే భారీ బహిరంగ సభతో ఈ నాటి పాదయాత్ర ముగుస్తుంది. మరోవైపు ఈనాటి పాదయాత్రలో ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. షర్మిల ఆటోను నడిపి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, డ్రైవరన్నల కష్టానికి ఫలితం దక్కే రోజు దగ్గర్లోనే ఉందని చెప్పారు. కర్షకులతో పాటు కార్మికుల సంక్షేమానికి కూడా సమ ప్రాధాన్యతను ఇవ్వడమే వైఎస్సార్టీపీ ధ్యేయమని అన్నారు.

More Telugu News