Rana Daggubati: సాయిపల్లవికి హ్యాట్రిక్ హిట్ దక్కేనా?

  • సాయిపల్లవి నుంచి 'విరాటపర్వం'
  • యథార్థ సంఘటన నేపథ్యంగా నడిచే కథ 
  • వెన్నెల పాత్రలో కనిపించనున్న సాయిపల్లవి 
  • రేపు భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు  
Virataparvam movie update

తెలుగులో సాయిపల్లవికి గల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పని లేదు. ఇటు యూత్ లోను .. అటు ఫ్యామిలీ ఆడియన్స్ లోను ఆమెకి మంచి ఫాలోయింగ్ ఉంది. ఆ మధ్య ఆమె నుంచి వచ్చిన 'లవ్ స్టోరీ' యూత్ కి ఒక రేంజ్ లో కనెక్ట్ అయింది. దాంతో ఈ సినిమా విడుదలైన ప్రతి ప్రాంతంలో భారీ వసూళ్లను రాబట్టింది.

ఆ తరువాత వచ్చిన 'శ్యామ్ సింగ రాయ్' సినిమాలో దేవదాసీగా సాయిపల్లవి కొత్త లుక్ తో కనిపించింది. ఆమె నటన కూడా ఆ సినిమాకి హైలైట్ గా నిలిచింది. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఈ సినిమా మంచి మార్కులు కొట్టేసింది. ఇక ఇప్పుడు ఆమె నుంచి రావడానికి 'విరాటపర్వం' ముస్తాబవుతోంది. రేపు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

ఈ సినిమా హిట్ అయితే సాయిపల్లవి ఖాతాలో హ్యాట్రిక్ హిట్ నమోదవుతుంది. దాని కోసమే సాయిపల్లవి అభిమానులంతా వెయిట్ చేస్తున్నారు. ఇది ఒక యథార్థ సంఘటన అంటూ, ఈ సినిమాలో సాయిపల్లవి పోషించిన 'వెన్నెల' పాత్రను హైలైట్ చేస్తూ వెళ్లారు. ఆ పాత్ర ఆమెకి హ్యాట్రిక్ హిట్ తెచ్చిపెడుతుందేమో చూడాలి మరి.

More Telugu News