Telangana: భూ నిర్వాసితులపై లాఠీఛార్జ్ చేసిన పోలీసుల‌పై చర్యలు తీసుకునేలా డీజీపిని ఆదేశించండి: గ‌వ‌ర్న‌ర్‌కు బండి సంజ‌య్ విజ్ఞ‌ప్తి

  • ప‌రిహారం కోసం గౌర‌వెల్లి ప్రాజెక్టు భూనిర్వాసితుల నిర‌స‌న‌
  • నిర‌స‌న‌కారుల‌పై లాఠీ చార్జీ చేసిన పోలీసులు
  • పోలీసుల‌పై చ‌ర్య‌ల‌కు డీజీపీని ఆదేశించాల‌న్న బండి సంజ‌య్‌
  • నిర్వాసితుల‌కు ప‌రిహారం ఇచ్చేలా ప్ర‌భుత్వాన్ని ఆదేశించాల‌ని డిమాండ్‌
  • గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసైకి బీజేపీ తెలంగాణ శాఖ విన‌తి ప‌త్రం
bandi sanjay coplaint to governor tamilisai over gouravelli lathi charge

గౌర‌వెల్లి, గండిపెల్లి ప్రాజెక్టుల భూనిర్వాసితుల‌పై జ‌రిగిన‌ లాఠీ చార్జీపై బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేర‌కు బుధ‌వారం పార్టీ నేత‌ల‌తో క‌లిసి రాజ్ భ‌వ‌న్ వెళ్లిన బండి సంజ‌య్‌...గ‌వ‌ర్న‌ర్‌తో భేటీ అయ్యారు. భూ నిర్వాసితుల‌పై లాఠీ చార్జీ చేసిన పోలీస్ అధికారుల‌ను గుర్తించి వారిపై చ‌ర్య‌లు తీసుకునేలా రాష్ట్ర డీజీపీని ఆదేశించాల‌ని ఆయ‌న గ‌వ‌ర్న‌ర్‌ను కోరారు. 

గౌర‌వెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులు ప‌రిహారం కోసం మంగ‌ళ‌వారం నిర‌స‌న‌కు దిగ‌గా.. పోలీసులు వారిపై లాఠీ చార్జీ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌కు చెందిన దృశ్యాలు రాష్ట్రవ్యాప్తంగా క‌ల‌క‌లం రేపాయి. గౌర‌వెల్లి ప్రాజెక్టుతో పాటు గండిపెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితుల‌కు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇచ్చి వారి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించడంతో పాటు ప్రాజెక్టుల‌ను పూర్తి చేసేలా రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఆదేశించాల‌ని కూడా గ‌వ‌ర్న‌ర్‌ను బండి సంజ‌య్ బృందం కోరింది.

More Telugu News