Pavan kalyan: పవన్ సినిమాలో కేతిక శర్మకి ఛాన్స్!

  • 'రొమాంటిక్' మూవీతో పరిచయమైన కేతిక
  • యూత్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న బ్యూటీ
  • రిలీజ్ కి రెడీగా ఉన్న 'అంగరంగ వైభవంగా
  • 'వినోదయా సితం' రీమేకులో ఛాన్స్
Kethika Sharma in Pavan movie

టాలీవుడ్ కి ఈ మధ్య కాలంలో పరిచయమైన కుర్ర కథానాయికలలో కృతి శెట్టి .. శ్రీలీల తరువాత స్థానంలో కేతిక శర్మ కనిపిస్తుంది. 'రొమాంటిక్' సినిమాతో ఈ బ్యూటీ తెలుగు తెరకి పరిచయమైంది. హాట్ హాట్ అందాలతో ఈ సుందరి కుర్రాళ్ల మతులు పోగొట్టేసింది. ఆ తరువాత 'లక్ష్య' సినిమాతోను అందంగానే అలరించింది. 

అయితే ఆ రెండు సినిమాలు కూడా కథాకథనాల పరంగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. దాంతో తన మూడో సినిమాగా వస్తున్న 'అంగరంగ వైభవంగా'పైనే కేతిక ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా విడుదలకి ముస్తాబవుతూ ఉండగానే, ఆమెను మరో అవకాశం వరించినట్టుగా తెలుస్తోంది. అదీ పవన్ సినిమాలో కావడం విశేషం. 

పవన్ 'వినోదయా సితం' అనే తమిళ రీమేక్ లో చేయనున్నారు. సముద్రఖని దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాలో సాయితేజ్ ఒక ముఖ్యమైన పాత్రను పోషించనున్నాడు. ఆయనకి జోడీగా కేతిక శర్మను ఎంపిక చేసినట్టుగా చెబుతున్నారు. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ రానుంది.

More Telugu News