Balakrishna: 'ఎఫ్ 4' విషయంలో అనుమానాలు అవసరం లేదు: అనిల్ రావిపూడి

  • ఇటీవలే విడుదలైన 'ఎఫ్ 3'
  • తాము ఆశించిన రెస్పాన్స్ వచ్చిందన్న అనిల్ రావిపూడి
  • 'ఎఫ్ 4' ఉంటుందంటూ స్పష్టీకరణ 
  • తన నెక్స్ట్ మూవీ బాలయ్యతో ఉంటుందంటూ వివరణ
Anil Ravipudi Interview

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్ - వరుణ్ తేజ్ కథానాయకులుగా చేసిన 'ఎఫ్ 3' ఇటీవలే థియేటర్లకు వచ్చింది. 17 రోజుల్లో ఈ సినిమా 65.64 కోట్ల షేర్ ను రాబట్టింది. అయితే ఈ సినిమా ఆశించినస్థాయిని అందుకోలేకపోయిందనే టాక్ వచ్చింది. దాంతో ముందుగా అనుకున్నట్టుగా 'ఎఫ్ 4' ఉండకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది.


ఈ నేపథ్యంలో అనిల్ రావిపూడి మాట్లాడుతూ .. 'ఎఫ్ 3' సినిమా మేము అనుకున్నట్టుగానే ప్రేక్షకులకు చాలా ఫాస్టుగా కనెక్ట్ అయింది. అందరూ కూడా ఈ సినిమాను విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమా సీక్వెల్ విషయంలో మేము మనసు మార్చుకోలేదు. 'ఎఫ్ 4' తప్పకుండా ఉంటుంది .. అందులో ఎలాంటి సందేహం లేదు.

నా నెక్స్ట్ మూవీ బాలకృష్ణగారితో ఉంటుంది .. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.  త్వరలోనే ఈ సినిమాను పట్టాలపైకి తీసుకుని వెళతాము. ఈ సినిమాలో కొత్త బాలకృష్ణగారిని చూస్తారు. ఆయన సినిమా నుంచి అభిమానులు ఆశించే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయి" అని చెప్పుకొచ్చాడు.

More Telugu News