YSRCP: ఎమ్మెల్సీ అనంత‌బాబు బెయిల్ పిటిష‌న్‌పై విచార‌ణ వాయిదా

  • డ్రైవ‌ర్ హ‌త్య కేసులో అరెస్ట్ అయిన అనంత‌బాబు
  • రాజ‌మ‌హేంద్ర‌వ‌రం సెంట్ర‌ల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఎమ్మెల్సీ
  • ఎమ్మెల్సీ బెయిల్ పిటిష‌న్‌పై వాద‌న‌లు పూర్తి
  • ఈ నెల 15న నిర్ణ‌యాన్ని వెలువ‌రించ‌నున్న కోర్టు
rajamahendravaram court adjourns mlc anantha babu bail petition

త‌న వ‌ద్ద డ్రైవ‌ర్‌గా ప‌నిచేసిన సుబ్ర‌హ్మ‌ణ్యం అనే వ్యక్తిని హత్య చేసిన కేసులో వైసీపీ బహిష్కృత ఎమ్మెల్సీ అనంత‌బాబు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిష‌న్‌పై విచార‌ణ మ‌రోమారు వాయిదా ప‌డింది. ఈ పిటిష‌న్‌ను విచారిస్తున్న రాజ‌మ‌హేంద్ర‌వ‌రం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టు విచార‌ణ‌ను ఈ నెల 15కు వాయిదా వేసింది. ఈ కేసులో అనంత‌బాబు ప్ర‌స్తుతం రాజ‌మ‌హేంద్ర‌వ‌రం సెంట్ర‌ల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. 

ఏపీలో రాజ‌కీయ ప్ర‌కంప‌న‌లు సృష్టించిన ఈ కేసులో త‌న‌కు బెయిల్ ఇవ్వాలంటూ ఇదివ‌ర‌కే అనంబాబు పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈ పిటిష‌న్‌పై ఇప్ప‌టికే రెండు సార్లు విచార‌ణ జ‌ర‌గ‌గా. సోమ‌వారం నాటి విచార‌ణ‌లో భాగంగా రాజ‌మ‌హేంద్ర‌వ‌రం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టు న్యాయ‌మూర్తి... అనంత‌బాబు, పోలీసుల వాద‌న‌ల‌ను విన్నారు. ఈ పిటిష‌న్‌పై త‌న నిర్ణ‌యాన్ని ఈ నెల 15న వెల్ల‌డిస్తాన‌ని చెప్పిన న్యాయ‌మూర్తి విచార‌ణ‌ను వాయిదా వేశారు.

More Telugu News