Janasena: జ‌గ‌న్ సంపూర్ణ మ‌ద్య‌పాన నిషేధంపై నాదెండ్ల మ‌నోహ‌ర్ కామెంట్

  • సంపూర్ణ మ‌ద్య‌పాన నిషేధం అంటే ఆదాయం పెంచుట అంటూ నాదెండ్ల సెటైర్‌
  • పెరిగిన ఆదాయంతో బాండ్లు బ‌జార్‌లో అమ్ముట అంటూ ఎద్దేవా
  • మేనిఫెస్టో అమ‌లుతో జ‌గ‌న్ జాక్ పాట్ కొట్టార‌న్న నాదెండ్ల‌
janasena leader nadendlamnohar satires on jagan liquor ban

తాను అధికారంలోకి వ‌స్తే ఏపీలో సంపూర్ణ మ‌ద్య‌పాన నిషేధాన్ని అమ‌లు చేస్తాన‌ని వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి 2019 ఎన్నిక‌ల ముందు ప్ర‌క‌టించిన హామీపై విప‌క్షాలు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా జ‌న‌సేన రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ (పీఏసీ) చైర్మ‌న్ నాదెండ్ల మ‌నోహ‌ర్ తాజాగా జ‌గ‌న్ మ‌ద్య‌పాన నిషేధంపై ఓ ట్వీట్ సంధించారు. 

సంపూర్ణ మద్యపాన నిషేధం అనగా మద్యం ఆదాయాన్ని రూ.9 వేల కోట్ల నుంచి రూ.22 వేల కోట్లకు పెంచుట అంటూ నాదెండ్ల మ‌నోహ‌ర్‌ సెటైరిక‌ల్ కామెంట్ చేశారు. ఆ రాబడి చూపించి రూ.8 వేల కోట్ల బాండ్లు బజార్లో అమ్ముట అంటూ ఆయ‌న ఇంకో వ్యంగ్యాస్త్రం సంధించారు. చివ‌ర‌గా ఇదీ ‘స్పిరిటెడ్ విజనరీ’ అంటూ జ‌గ‌న్‌ను దెప్పి పొడిచారు. మేనిఫెస్టో అమ‌లుతో జ‌గ‌న్ జాక్ పాట్ కొట్టార‌ని కూడా నాదెండ్ల వ్యాఖ్యానించారు.

More Telugu News