Team India: సింగిల్ ఫ్రేమ్‌లో ఇద్ద‌రు క్రికెట్ లెజెండ్లు

  • ఇటీవ‌లే బేడీని క‌లిసిన ద్ర‌విడ్‌
  • ఫొటోను షేర్ చేసిన బేడీ కుమార్తె
  • అరుదైన ఫొటోగా అభివ‌ర్ణించిన వైనం
team india head coach rahul dravid with bishan singh bedi

భార‌త క్రికెట్‌లోనే కాకుండా వ‌ర‌ల్డ్ క్రికెట్‌లోనూ ఈ ఫొటో అరుదైన‌దిగానే నిలిచిపోతుంద‌ని చెప్ప‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఫొటోలో క‌నిపిస్తున్న ఇద్ద‌రిలో ఒక‌రికి మ‌నం ఇట్టే గుర్తు ప‌ట్టేస్తాం. ఫొటోలో నిలుచుకున్న వ్య‌క్తి ప్ర‌స్తుతం టీమిండియా హెడ్ కోచ్‌గా ప‌నిచేస్తున్న టీమిండియా మాజీ కెప్టెన్‌, మిస్ట‌ర్ డిపెండ‌బుల్‌గా పేరు గాంచిన రాహుల్ ద్రావిడ్‌. 

ఇక కుర్చీలో కూర్చున్న వ్య‌క్తిని ఇప్ప‌టి త‌రం పెద్ద‌గా గుర్తు ప‌ట్ట‌క‌పోవ‌చ్చు గానీ... క్రికెట్‌పై కాస్తంత అవ‌గాహ‌న ఉన్న వారెవ‌రైనా ఆయ‌న పేరు చెబితే ఇట్టే గుర్తు ప‌ట్టేస్తారు. ఆయ‌న మ‌రెవ‌రో కాదు భార‌త క్రికెట్ జ‌ట్టుకు స్వల్ప‌కాలం పాటు కెప్టెన్‌గా వ్య‌వ‌హరించిన లెఫ్టార్మ్ స్పిన్న‌ర్ బిష‌న్ సింగ్ బేడీ. ఇటీవ‌లే బేడిని ద్ర‌విడ్ క‌లిసిన సంద‌ర్భంగా తీసిన ఈ ఫొటోను బేడి కుమార్తె నేహా బేడీ సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు.

బేడీ, ద్ర‌విడ్‌లు...ఇద్ద‌రూ భార‌త క్రికెట్‌కు ఎన‌లేని సేవ‌లు చేసిన వారే. 1966 నుంచి 1979 వ‌ర‌కు భార‌త జ‌ట్టు త‌ర‌ఫున బేడీ ఆడారు. మొత్తం 67 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన బేడీ... ఏకంగా 266 వికెట్లు తీసుకున్నారు. 22 టెస్టుల‌కు భార‌త జ‌ట్టుకు కెప్టెన్‌గానూ వ్య‌వ‌హ‌రించారు. పంజాబ్‌లోని అమృత్‌స‌ర్‌కు చెందిన ఈయ‌న ప్ర‌స్తుతం వృద్ధాప్యం నేప‌థ్యంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.

ఇక రాహుల్ ద్ర‌విడ్ విష‌యానికి వ‌స్తే... భార‌త జ‌ట్టుకు మెరిక‌ల్లాంటి ప్లేయ‌ర్ల‌ను అందించే ప‌నిని త‌న భుజ‌స్కందాల‌పైకి ఎత్తుకున్న భార‌త మాజీ క్రికెట‌ర్‌. టీమిండియాకు కొంత కాలం పాటు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించిన ద్ర‌విడ్‌... టీమిండియా ఓపెన‌ర్‌గా చిర‌ప‌ర‌చితులు. క్రీజులో కుదురుకున్నాడంటే ఇక ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్లు ఎంత క‌ష్టించినా వికెట్ పారేసుకునే ర‌కం కాదు ద్ర‌విడ్‌. నేష‌న‌ల్ క్రికెట్ అకాడెమీకి చైర్మ‌న్‌గా ప‌నిచేసిన ద్ర‌విడ్‌...కేఎల్ రాహ‌ల్ లాంటి ఎంద‌రో ఉత్త‌మ ఆట‌గాళ్ల‌ను టీమిండియాకు అందించారు. అందుకే కాబోలు...ఆయ‌న‌ను ఏరికోరి మ‌రీ ఇప్పుడు టీమిండియా జ‌ట్టుకు ప్ర‌ధాన కోచ్‌గా ఎంపిక చేశారు.

More Telugu News