sarad pawar: ఫడ్నవిస్ మిరకిల్ చేశారు: శరద్ పవార్

  • స్వతంత్ర ఎమ్మెల్యేలను ఫడ్నవిస్ తన వైపు తిప్పుకున్నారన్న పవార్ 
  • లేదంటే వారు ఎంవీఏకే మద్దతు ఇచ్చేవారని వ్యాఖ్య 
  • తమ కూటమివైపు ఒక్క ఓటు కూడా తప్పలేదని ప్రకటన
Fadnavis performed miracle of weaning away independent MLAs

మహారాష్ట్ర రాజ్యసభ ఎన్నికల ఫలితాలను చూసి తాను షాక్ కు గురి కాలేదని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ అన్నారు. బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ప్రతిభను ఈ సందర్భంగా పవార్ మెచ్చుకున్నారు. అద్భుతం సృష్టించారని, స్వతంత్రుల మద్దతు సంపాదించడంలో కృతకృత్యులు అయ్యారంటూ.. ఫలితమే మహారాష్ట్ర నుంచి బీజేపీ పోటీ చేసిన మూడు స్థానాల్లోనూ విజయం సాధించినట్టు చెప్పారు. 

ఎన్నికల్లో శివసేన అభ్యర్థి ఓటమి పాలవడం తెలిసిందే. ‘‘ఫలితాలు చూసి నేను షాక్ అవ్వలేదు. మహారాష్ట్ర వికాస్ అఘాడీ (ఎంవీఏ) రాజ్యసభ అభ్యర్థిగా ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యా బలానికి తగ్గట్టే ఓట్లు వచ్చాయి. కానీ, స్వతంత్ర ఎమ్మెల్యేలను దూరం చేయడంలో బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ చేసిన అద్భుతాన్ని ఎవరైనా ఆమోదించాల్సిందే. లేదంటే సదరు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఎంవీఏకు మద్దతు ఇచ్చి ఉండేవారు. విజయవంతంగా స్వతంత్రులను ఆయన తన వైపునకు తిప్పుకున్నారు’’ అని పూణెలో విలేకరులతో పవార్ అన్నారు. 

కొంత సంఖ్యా బలం తక్కువగా ఉన్నప్పటికీ ఆరో అభ్యర్థిని గెలిపించుకునేందుకు మహావికాస్ అఘాఢీ కూటమి ఎన్నో ప్రయత్నాలు చేసినట్టు పవార్ చెప్పారు. కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన ఓట్లలో ఒక్కదాని విషయంలోనూ తేడా రాలేదన్నారు.

More Telugu News