Balakrishna: బాలయ్య ఫస్టు హంట్ టీజర్ కి కోటికి పైగా వ్యూస్!

  • సెట్స్ పై ఉన్న బాలయ్య 107వ సినిమా 
  • పుట్టినరోజూ సందర్భంగా వదిలిన టీజర్
  • యూ ట్యూబ్ లో నెంబర్ 1 ప్లేస్ లో టెండింగ్ 
  • దసరాకి సినిమాను రిలీజ్ చేసే ఛాన్స్
Gipichand Malineni movie update

బాలకృష్ణ - గోపీచంద్ మలినేని కాంబినేషన్లో ఒక సినిమా రూపొందుతోంది. కెరియర్ పరంగా బాలకృష్ణకి ఇది 107వ సినిమా ..  ఇంకా టైటిల్ ను ఖరారు చేయలేదు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా, రాయలసీమ ఫ్యాక్షనిజం చుట్టూ తిరుగుతుంది. కొంత కాలంగా ఈ సినిమా చాలా వేగంగా షూటింగును జరుపుకుంటోంది.

ఈ నేపథ్యంలో బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్టు హంట్ పేరుతో టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ ను ఇలా వదలగానే అలా దూసుకుపోతోంది. ఇంతవరకూ ఈ టీజర్ కోటికి పైగా వ్యూస్ ను రాబట్టడం విశేషం.  యూ ట్యూబ్ లో ఈ టీజర్ నెంబర్ వన్  ప్లేస్ లో ట్రెండింగ్ అవుతోంది. 

ఈ సినిమాలో బాలయ్య లుక్ మంచి మార్కులు కొట్టేసింది. పవర్ఫుల్ డైలాగ్స్ పై .. భారీ యాక్షన్ సీన్స్ పై కట్ చేసిన ఈ టీజర్ చాలామందికి వెంటనే కనెక్ట్ అయింది.  ఈ సినిమాలో బాలయ్యతో శ్రుతి హాసన్ జోడీ కడుతోంది. ప్రతినాయకుడిగా దునియా విజయ్ కనిపించనున్నాడు. దసరాకి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

More Telugu News