Allu Arjun: సంక్రాంతి బరిలోకి 'పుష్ప 2'

  • సంచలన విజయాన్ని సాధించిన 'పుష్ప'
  • సీక్వెల్ దిశగా ముస్తాబవుతున్న 'పుష్ప 2'
  • స్క్రిప్ట్ పై నడుస్తున్న కసరత్తు 
  •  6 నెలల్లో ప్రాజెక్టును పూర్తి చేసే ఆలోచన  
Pushpa 2 movie update

అల్లు అర్జున్  - సుకుమార్ కాంబినేషన్లో  రూపొందిన 'పుష్ప' సంచలన విజయాన్ని సాధించింది. దాంతో ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ రెడీ అవుతోంది. పార్టు 1కి మించి పార్టు 2 ఉండేలా స్క్రిప్ట్ పై కసరత్తు చేస్తున్నారు. ఈ సారి సాధ్యమైనంత త్వరగా షూటింగును పూర్తి చేసేలా షెడ్యూల్స్ ను ప్లాన్ చేస్తున్నారు.

వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టి, 6 నెలల్లో అన్ని పనులను పూర్తి చేసి సంక్రాంతి బరిలోకి దింపాలనే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, ఈ సారి మరో హీరోయిన్ కి కూడా చోటు ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. ఇక ఐటమ్ సాంగ్ లో దిశా పటాని కనిపించనుందని అంటున్నారు.

 అయితే ఈ సారి సంక్రాంతికి గట్టి పోటీనే ఉండనుంది. చిరంజీవి 'భోళా శంకర్'  .. పవన్ ' హరి హర వీరమల్లు' .. త్రివిక్రమ్ కాంబినేషన్ లోని మహేశ్ మూవీ సంక్రాంతి దిశగా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో 'పుష్ప 2' ను కూడా ఆ దిశగానే నడిపిస్తుండటం ఆసక్తిని రేకెత్తించే అంశమే.

More Telugu News