India: దేశంలో కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి.. అప్డేట్స్ ఇవిగో!

  • గత 24 గంటల్లో 7,584 కరోనా కేసుల నమోదు
  • కరోనా నుంచి కోలుకున్న 3,791 మంది
  • దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 36,267
India reports 7584 fresh Corona cases

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. వరుసగా రెండో రోజు 7 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 7,584 కొత్త కేసులు నిర్ధారణ అయ్యాయి. అంతకు ముందు రోజు 7,240 కేసులు నమోదు కావడం గమనార్హం. ఇదే సమయంలో 3,791 మంది కరోనా నుంచి కోలుకోగా... 24 మంది మృతి చెందారు. ప్రస్తుతం 36,267 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 4,32,05,106కి చేరుకున్నాయి. ఇప్పటి వరకు 4,26,44,092 మంది కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 5,24,747కి చేరుకుంది. 

కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 8,813 నమోదయ్యాయి. ఆ తర్వాత కేరళలో 2,193, ఢిల్లీలో 622, కర్ణాటకలో 471, హర్యానాలో 348 కేసులు నిర్ధారణ అయ్యాయి. దేశంలో రికవరీ రేటు 98.70 శాతంగా, పాజిటివిటీ రేటు 2.26 శాతంగా, మరణాల రేటు 1.21 శాతంగా ఉన్నాయి. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,94,76,42,992 డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిన్న ఒక్క రోజే 15.31 లక్షల మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.

More Telugu News