Balakrishna: మంగ‌ళ‌గిరిలో అన్న క్యాంటీన్ ఏర్పాట్లకు సన్నాహాలు.. బాలయ్య ఫ్యాన్స్, టీడీపీ నేత‌ల అరెస్ట్‌

  • రేపు బాల‌కృష్ణ జ‌న్మదినం
  • మంగ‌ళ‌గిరి బ‌స్టాండ్ స‌మీపంలో అన్న క్యాంటీన్‌కు స‌న్నాహాలు
  • బాల‌య్య అభిమానులు, టీడీపీ శ్రేణుల‌ను అడ్డుకున్న అధికారులు
  • పోలీసుల ఎంట్రీతో ఉద్రిక్త ప‌రిస్థితులు

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి ప‌రిధిలోని మంగ‌ళ‌గిరిలో గురువారం సాయంత్రం తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. శుక్ర‌వారం ప్ర‌ముఖ సినీ న‌టుడు, టీడీపీ ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని బాల‌కృష్ణ అభిమానులు, టీడీపీ శ్రేణులు మంగ‌ళ‌గిరి బ‌స్టాండ్ స‌మీపంలో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయాల‌ని భావించారు. బ‌స్టాండ్ స‌మీపంలోని ఎన్టీఆర్ విగ్ర‌హం వ‌ద్ద చాలా రోజులుగా టీడీపీ శ్రేణులు చ‌లివేంద్రాన్ని కొన‌సాగిస్తున్నారు. అక్క‌డే తాజాగా అన్న క్యాంటీన్‌ను ఏర్పాటు చేసేందుకు వారు య‌త్నించారు.

దీనిపై స‌మాచారం అందుకున్న న‌గ‌ర పాల‌క సంస్థ అధికారులు అన్న క్యాంటీన్ ఏర్పాట్ల‌ను అడ్డుకున్నారు. తాము సేవా కార్యక్ర‌మం మాత్ర‌మే చేస్తున్నామ‌ని టీడీపీ శ్రేణులు చెప్పినా అధికారులు విన‌లేదు. ఈ క్ర‌మంలో ఎంత‌కీ టీడీపీ శ్రేణులు విన‌క‌పోవ‌డంతో అధికారుల స‌మాచారంతో భారీ ఎత్తున పోలీసులు అక్క‌డ‌కు చేరుకున్నారు. అన్న క్యాంటీన్ ఏర్పాట్ల‌లో మునిగిన బాల‌య్య అభిమానులు, టీడీపీ శ్రేణుల‌ను అరెస్ట్ చేసి అక్క‌డి నుంచి త‌ర‌లించారు. దీంతో అక్క‌డ తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.

More Telugu News