Balakrishna: బాలయ్య న్యూ మూవీ టీజర్ రిలీజ్ కి సమయం ఖరారు!

  • రేపు బాలకృష్ణ బర్త్ డే
  • సెట్స్ పై ఉన్న 107వ  సినిమా  
  • ఈ రోజు సాయంత్రం టీజర్ రిలీజ్
  • టైటిల్ ను రివీల్ చేసే అవకాశం
Gopichand Malineni movie update

బాలకృష్ణ కథానాయకుడిగా ఆయన 107వ సినిమా రూపొందుతోంది. మైత్రీ బ్యానర్లో నిర్మితమవుతున్న ఈ సినిమాకి, గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా శ్రుతి హాసన్ నటిస్తుండగా .. ప్రతినాయక పాత్రలో దునియా విజయ్ కనిపించనున్నాడు. ఆయన మాస్ విలనిజమే ఈ సినిమాకి హైలైట్ అంటున్నారు.

రేపు బాలకృష్ణ పుట్టినరోజు .. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమా నుంచి ఏదైనా అప్ డేట్ రావొచ్చని అంతా భావించారు. అనుకున్నట్టుగానే ఈ రోజున ఇంట్రస్టింగ్ అప్ డేట్ రాబోతోందని అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ రోజు సాయంత్రం 6 గంటల 11 నిమిషాలకు టీజర్ ను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. టైటిల్ కూడా రివీల్ చేస్తారేమో చూడాలి. 

గోపీచంద్ మలినేని ఈ సినిమాను బాలయ్యకి అచ్చొచ్చిన ఫ్యాక్షన్ నేపథ్యంలోనే రూపొందిస్తున్నాడు. బాలయ్య సినిమా నుంచి అభిమానులు ఆశించే అన్ని అంశాలు కథలో ఉండేలా చూసుకుంటూనే, ట్రీట్మెంట్ డిఫరెంట్ గా ఉండేలా జాగ్రత్తపడినట్టుగా అర్థమవుతోంది. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు..

More Telugu News