Hyderabad: పోలీసు కస్ట‌డీకి గ్యాంగ్ రేప్ నిందితుడు సాదుద్దీన్‌

  • గ్యాంగ్ రేప్ నిందితుల్లో సాదుద్దీన్ ఒక్క‌డే మేజ‌ర్‌
  • సాదుద్దీన్‌ను 3 రోజుల పోలీసు కస్ట‌డీకి ఇచ్చిన నాంప‌ల్లి కోర్టు 
  • రేపు సాదుద్దీన్‌ను క‌స్ట‌డీలోకి తీసుకోనున్న పోలీసులు
nampally court allows police to question gang rape accused saduddinfor three days

హైద‌రాబాద్‌లో క‌ల‌క‌లం రేపిన మైన‌ర్ బాలిక గ్యాంగ్ రేప్ ఘ‌ట‌న‌లో బుధ‌వారం కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న సాదుద్దీన్ మాలిక్‌ను పోలీసు క‌స్ట‌డీకి అప్ప‌గిస్తూ నాంప‌ల్లి కోర్టు బుధ‌వారం ఉద‌యం తీర్పు చెప్పింది. కోర్టు ఆదేశాల‌తో రేపు ఉద‌యం సాదుద్దీన్‌ను పోలీసులు త‌మ క‌స్ట‌డీలోకి తీసుకోనున్నారు. మూడు రోజుల పాటు అత‌డిని పోలీసులు విచారించ‌నున్నారు.

గ్యాంగ్ రేప్‌లో మొత్తం ఆరుగురు నిందితులు ఉండ‌గా... వారిలో సాదుద్దీన్ ఒక్క‌డే మేజ‌ర్‌. మిగిలిన ఐదుగురు నిందితులు మైన‌ర్లే. దీంతో సాదుద్దీన్‌ను మంగ‌ళ‌వారం రాత్రి కోర్టు అనుమ‌తితో జ్యూడిషియ‌ల్ రిమాండ్‌కు త‌ర‌లించిన పోలీసులు మిగిలిన ఐదుగురు మైన‌ర్ల‌ను జ్యువెనైల్ హోంకు త‌ర‌లించారు. తాజాగా కోర్టు అనుమ‌తితో సాదుద్దీన్‌ను పోలీసులు రేపు త‌మ క‌స్ట‌డీలోకి తీసుకోనున్నారు.

More Telugu News