BJP: జీహెచ్ఎంసీ కార్పొరేట‌ర్ల‌తో మోదీ ఆత్మీయ స‌మ్మేళ‌నం

  • మోదీతో భేటీ కోసం ఢిల్లీ వెళ్లిన కార్పొరేట‌ర్లు
  • కార్పొరేట‌ర్ల‌ వ్య‌క్తిగ‌త వివ‌రాలు తెలుసుకున్న మోదీ
  • ఒక్కొక్క‌రినీ ప‌ల‌క‌రిస్తూ ఆత్మీయ‌త క‌న‌బ‌ర‌చిన ప్ర‌ధాని
  • ఉబ్బిత‌బ్బిబ్బు అయిన కార్పొరేట‌ర్లు
pm modi meets ghmc corporators in delhi

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ పిలుపు మేర‌కు ఢిల్లీ వెళ్లిన గ్రేట‌ర్ హైద‌రాబాద్ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ (జీహెచ్ఎంసీ) కార్పొరేట‌ర్లు నేటి సాయంత్రం మోదీతో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా కార్పొరేట‌ర్ల‌కు మోదీ నుంచి ఆత్మీయ ప‌ల‌క‌రింపు ద‌క్కింది. ప్ర‌తి కార్పొరేట‌ర్ వ‌ద్ద‌కు వ‌చ్చిన మోదీ వారి వివ‌రాలు, వారి కుటుంబ వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా వారి పిల్ల‌లు, విద్యాభ్యాసం త‌దిత‌రాల‌ను కూడా మోదీ అడిగి తెలుసుకున్నారు. 

ప్ర‌ధాన మంత్రి హోదాలో ఉన్న నేత నుంచి ఈ త‌ర‌హా ప‌ల‌క‌రింపు ఎదుర‌య్యేస‌రికి జీహెచ్ఎంసీ కార్పొరేట‌ర్లు ఉబ్బితబ్బిబ్బు అయ్యారు. గ‌డ‌చిన జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో స‌త్తా చాటార‌ని కార్పొరేట‌ర్ల‌ను మెచ్చుకున్న మోదీ... త్వ‌ర‌లో రానున్న ఎన్నిక‌ల్లో మ‌రింత మేర స‌త్తా చాటాల‌ని సూచించారు. పార్టీ అండ‌గా ఉంటుంద‌ని, హైద‌రాబాద్‌లో బీజేపీని బ‌లోపేతం చేసే దిశ‌గా కృషి చేయాల‌ని ఆయ‌న కార్పొరేట‌ర్ల‌ను కోరారు.

More Telugu News