Hizbul terrorist: బెంగళూరులో హిజ్భుల్ ముజాహిదీన్ ఉగ్రవాది అరెస్ట్

  • కశ్మీర్ లో హిందువుల హత్యల్లో అతడి ప్రమేయం
  • అరెస్ట్ చేసి తీసుకెళ్లిన జమ్మూ కశ్మీర్ పోలీసులు
  • సహకారం అందించిన కర్ణాటక పోలీసులు
Hizbul terrorist arrested in Bengaluru over targeted killing of Hindus in J K

కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ టెర్రరిస్ట్ ను బెంగళూరులో జమ్మూ కశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేశారు. కశ్మీర్ లోయలో హిందువులను లక్ష్యంగా చేసుకుని హత్యలకు పాల్పడిన ఘటనలో అతడి ప్రమేయం ఉండడంతో బెంగళూరులో అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. 

‘‘రాహుల్ భట్ హత్యలో ఇద్దరు ఉగ్రవాదుల ప్రమేయం ఉంది. ఒకరు కాల్పుల్లో మరణించారు. మరొకరిని అరెస్ట్ చేశాం. అమ్రీన్ భట్ హత్య కేసులో నిందితులైన ఇద్దరు ఉగ్రవాదులు కాల్పుల్లో మరణించారు. బ్యాంకు మేనేజర్ విజయ్ కుమార్ హత్య కేసులో ప్రేమేయం ఉన్న ఉగ్రవాదులను గుర్తించాం. త్వరలోనే వారిని అరెస్ట్ చేస్తాం లేదంటే వారి ముప్పును తొలగిస్తాం’’ అని జమ్మూ కశ్మీర్ పోలీసు ఇన్ స్పెక్టర్ జనరల్ తెలిపారు. 

జూన్ 2న రాజస్థాన్ కు చెందిన బ్యాంకు మేనేజర్ విజయ్ కుమార్ ను కుల్గామ్ జిల్లాలో బ్యాంకు శాఖలో ఉన్న సమయంలోనే ఉగ్రవాదులు కాల్చి చంపడం తెలిసిందే. అంతకుముందు బుద్గామ్ లో టీవీ నటి అమ్రీన్ భట్ ను లష్కరే తోయిబా ఉగ్రవాదులు కాల్చి చంపారు. మే 12న రెవెన్యూ ఉద్యోగి రాహుల్ భట్ ను బుద్గామ్ జిల్లాలోనే ఉగ్రవాదులు హత్య చేశారు.  

దీనిపై కర్ణాటక సీఎం బస్వరాజ్ బొమ్మై మాట్లాడుతూ.. ‘‘ఇది ఎప్పుడూ నడిచే ప్రక్రియే. ప్రజల కదలికలపై పోలీసుల నిఘా ఉంటుంది. జమ్మూ కశ్మీర్ పోలీసులు బెంగళూరులో ఉగ్రవాదిని అరెస్ట్ చేశారు. దీనికి మా పోలీసులు సహకారం అందించారు’’ అని ప్రకటించారు.

More Telugu News