Mahesh Babu: 'సర్కారువారి పాట' నుంచి 'మురారివా' సాంగ్  రిలీజ్!                     

  • క్రితం నెల 12వ తేదీన వచ్చిన 'సర్కారువారి పాట'
  • సంగీత దర్శకుడిగా మెప్పించిన తమన్ 
  • అప్పుడు ఉపయోగించని 'మురారివా' పాట
  •  తాజాగా యూ ట్యూబ్ లో రిలీజ్ చేసిన టీమ్   
Sarkaru Vaari Paata new song released

మహేశ్ బాబు - కీర్తి సురేశ్ జంటగా పరశురామ్ దర్శకత్వంలో ' సర్కారు వారి పాట' సినిమా రూపొందింది. క్రితం నెల 12వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమన్ స్వరపరిచిన బాణీలు ఈ సినిమా విజయంలో కీలకమైన పాత్రను పోషించాయి. ముఖ్యంగా 'కళావతి' .. 'మ మ మహేశా' సాంగ్స్ ఒక రేంజ్ లో దూసుకుపోయాయి.

అయితే, ఈ సినిమా కోసం చిత్రీకరించిన 'మురారివా' అనే సాంగ్ ను కొన్ని కారణాల వలన ఉపయోగించలేదు.  సినిమా విడుదల తరువాత కొన్ని రోజులకు ఈ పాటను యాడ్ చేశారు. తాజాగా ఆ పాటను యూ ట్యూబ్ లో వదిలారు. 'మురారివా .. మురారివా .. మురళీ వాయిస్తూ ముడేస్తివా' అంటూ ఈ పాట సాగుతోంది. 


మహేశ్ బాబు - కీర్తి సురేశ్ పై బ్యూటిఫుల్ సెట్లో ఈ పాటను కలర్ఫుల్ గా చిత్రీకరించారు. సాహిత్యం పరంగా .. ట్యూన్ పరంగా ఓకే. కాకపోతే పరశురామ్ ఈ పాటను ఆపేసి .. ఆ ప్లేస్ లో మాస్ బీట్ గా 'మ మ మహేశా' వదలడమే కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత స్లో సాంగ్ .. అక్కడ ఆ ఫ్లోలో పడితే ఇబ్బందిగానే ఉండేదేమో!

More Telugu News