Karimnagar District: ప్రభుత్వ బడిలో చేరే పిల్లలకు నెలకు రూ. 500.. పుస్తకాలు, దుస్తుల ఖర్చు కూడా నాదే.. ఓ సర్పంచ్ హామీ

  • పిల్లలకు ప్రోత్సాహకంగా ప్రతి నెల రూ. 500 ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న సర్పంచ్ శారద
  • బడిబాటలో భాగంగా 50 మందిని చేర్పించాలని లక్ష్యం
  • హుజూరాబాద్ మండలం శాలపల్లి-ఇందిరానగర్ సర్పంచ్‌గా ఉన్న శారద
Rs 500 Incentive for children who joins in govt school

ప్రభుత్వ స్కూళ్లకు మళ్లీ ఆదరణ పెంచేందుకు, వాటికి పునర్వైభవం తీసుకొచ్చేందుకు ప్రభుత్వాలు ఎంతో కృషి చేస్తున్నాయి. అయినప్పటికీ ప్రైవేటు స్కూళ్లవైపే తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య రోజురోజుకు నీరసించిపోతోంది. ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం శాలపల్లి-ఇందిరానగర్ సర్పంచ్ కొడగూటి శారద తీసుకున్న నిర్ణయం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 

ఈ రెండు గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ బడుల్లో చేరే పిల్లలకు నెలకు రూ. 500 చొప్పున ప్రోత్సాహకం ఇవ్వడంతోపాటు వారి దుస్తులు, పుస్తకాలకు అయ్యే ఖర్చును కూడా భరిస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఈ రెండు గ్రామాల్లోని పాఠశాలల్లో ప్రస్తుతం 70 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా కనీసం మరో 50 మందిని చేర్పించాలని నిర్ణయించుకున్నట్టు సర్పంచ్ శారద తెలిపారు. ఆమె తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

More Telugu News