Manish Sisodia: గుజరాత్ ప్రజలకు ప్రత్యామ్నాయం మేమే.. 182 స్థానాల నుంచి బరిలోకి: ఆప్

  • పంజాబ్‌లో ఘన విజయంతో ఊపులో ఉన్న ‘ఆప్’
  • గుజరాత్ ప్రజలకు ప్రత్యామ్నాయం అందుబాటులోకి వచ్చిందన్న మనీశ్ సిసోడియా
  • ఇక ప్రజలే నిర్ణయించుకోవాలన్న ఢిల్లీ డిప్యూటీ సీఎం
We are the Alternative to gujarat people says Manish Sisodia

పంజాబ్ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌పైనా దృష్టి సారించింది. గుజరాత్‌లో త్వరలో జరగనున్న ఎన్నికలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించిన ‘ఆప్’ అప్పుడే వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగి తేలుతోంది. రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేయాలని భావిస్తున్న ఆ పార్టీ మొత్తం స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపాలని నిర్ణయించింది. ఈ మేరకు నిన్న వడోదరలో మాట్లాడిన ఆ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.

గుజరాత్ ప్రజలకు ఇప్పటి వరకు ప్రత్యామ్నాయం లేకుండా పోయిందని, ఇప్పుడు తాము ప్రత్యామ్నాయంగా మారబోతున్నామని చెప్పారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో తమ పార్టీ మొత్తం 182 స్థానాల్లోనూ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలకు ఇప్పుడు ప్రత్యామ్నాయం అందుబాటులోకి వచ్చిందని, ఇక ఓటు ఎవరికి వేయాలో వారే నిర్ణయించుకోవాలని సిసోడియా అన్నారు.

More Telugu News