Telangana: తెలంగాణలో కరోనా రోజువారీ కేసుల పెరుగుదల

  • దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా వ్యాప్తి
  • తెలంగాణలోనూ అదే తీరు
  • గత 24 గంటల్లో 11,107 కరోనా పరీక్షలు
  • 76 మందికి పాజిటివ్
  • హైదరాబాదులో 55 కొత్త కేసులు
  • యాక్టివ్ కేసుల సంఖ్య 547
Telangana corona media bulletin

దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి మళ్లీ పుంజుకున్నట్టే కనిపిస్తోంది. తెలంగాణలోనూ రోజువారీ కేసుల సంఖ్యలో పెరుగుదల చోటుచేసుకుంది. గడచిన 24 గంటల్లో 11,107 కరోనా పరీక్షలు నిర్వహించగా, 76 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

హైదరాబాదులో అత్యధికంగా 55 కొత్త కేసులు వెల్లడయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 10, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 3, జోగులాంబ గద్వాల్ జిల్లాలో 2, యాదాద్రి భువనగిరి జిల్లాలో 2, సంగారెడ్డి జిల్లాలో 2, మంచిర్యాల జిల్లాలో 1, సిద్ధిపేట జిల్లాలో 1 కేసు గుర్తించారు. అదే సమయంలో 49 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. 

తెలంగాణలో ఇప్పటివరకు 7,93,544 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,88,886 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 547 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మరణించారు.

More Telugu News