Seethakka: కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారు?: సీతక్క

  • హైదరాబాదులో మైనర్ బాలికపై అత్యాచారం
  • అధికార పార్టీ, వారి ఫ్లెండ్లీ పార్టీ వాళ్లు అత్యాచారం చేశారన్న సీతక్క
  • మహిళలంతా ప్రభుత్వాన్ని నిలదీయాలని పిలుపు
Why KCR is silent says Seethakka

సమాజంలో ఎంతో మందిపై అత్యాచారాలు జరుగుతున్నాయని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నడిబొడ్డున మైనార్టీ బాలికపై అధికార పార్టీ, వారి ఫ్రెండ్లీ పార్టీ నేతలు అత్యాచారం చేస్తే కనీసం ప్రశ్నించలేని స్థాయిలో ఉన్నామని చెప్పారు. మన బట్టల గురించో, వేసుకునో నగల గురించో, కూరగాయల గురించో గంటలు గంటలు చర్చించుకునే మనం... ఈరోజు మన పిల్లలపైనో, మన పక్కింటి పిల్లలపైనో ఘోరాలు జరుగుతుంటే మనం ఏమీ మాట్లాడటం లేదని అన్నారు.

చిన్నారిపై అత్యాచారం చేసిన నిందితులను కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని... ఇలాంటి పరిస్థితిలో ప్రతి మహిళ బయటకు వచ్చి ప్రభుత్వాన్ని నిలదీయాలని అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే సమయం ఆసన్నమయిందని చెప్పారు. మహిళల్లారా బయటకు రండి... మనల్ని మనం రక్షించుకుందామని పిలుపునిచ్చారు. దొంగలను, దోషులను, నిందితులను రక్షిస్తున్న ఈ ప్రభుత్వాన్ని నిలదీద్దామని అన్నారు. ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.

More Telugu News