PF: ఉద్యోగుల‌కు కేంద్రం షాక్‌... పీఎఫ్ వ‌డ్డీ రేటు త‌గ్గింపు

  • ప్ర‌స్తుతం పీఎఫ్‌పై 8.5 వ‌డ్డీ
  • 8.1 శాతానికి త‌గ్గిస్తూ కేంద్రం నిర్ణ‌యం
  • ఈ మేర వ‌డ్డీ రేటు త‌గ్గింపుతో ఉద్యోగుల‌కు భారీ న‌ష్ట‌మే
union government decreases interest on pf

ఉద్యోగుల‌కు కేంద్రంలోని న‌రేంద్ర మోదీ స‌ర్కారు శుక్ర‌వారం మ‌రో షాకిచ్చింది. ఉద్యోగుల భ‌విష్య నిధి (పీఎఫ్‌)పై వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గిస్తూ కేంద్రం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌స్తుతం పీఎఫ్‌పై 8.5 శాతం వ‌డ్డీ ఇస్తుండ‌గా...ఇప్పుడు ఆ వ‌డ్డీ శాతాన్ని ఏకంగా 8.1 శాతానికి త‌గ్గించేసింది.

 వాస్త‌వానికి పీఎఫ్ వ‌డ్డీ రేటు పెంపు అయినా, త‌గ్గింపు అయినా చాలా స్వ‌ల్ప మోతాదులోనే ఉంటున్న సంగ‌తి తెలిసిందే. 8.5 శాతంగా ఉన్న వ‌డ్డీ రేటును 0.25 శాతం మేర పెంచ‌డ‌మో, త‌గ్గించ‌డ‌మో చేస్తుంటారు. అలాంటిది ఇప్పుడు ఏకంగా 0.40 శాతం మేర వ‌డ్డీ రేటు త‌గ్గింపు అంటే ఉద్యోగుల‌కు భారీ న‌ష్ట‌మేన‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

More Telugu News