Bandi Sanjay: హైదరాబాదులో మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ ఘటనపై తీవ్రస్థాయిలో స్పందించిన బండి సంజయ్

  • జూబ్లీహిల్స్ లో దారుణం
  • కారులో బాలికపై అత్యాచారం
  • మహిళలకు భద్రత లేదని బండి సంజయ్ ఆవేదన
  • నిందితుల వివరాలు వెల్లడించాలని డిమాండ్
Bandi Sanjay slams TRS Govt over miner girl gang rape incident

హైదరాబాదులో ఓ కారులో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరగడంపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తీవ్రస్థాయిలో స్పందించారు. ఈ దారుణమైన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. ఇందులో అధికార పార్టీ మిత్రపక్షానికి చెందిన నేత బంధువు కూడా ఉన్నట్టు తెలుస్తోందని పేర్కొన్నారు. ఆ దుండగులపై చర్యలు తీసుకునేందుకు ఒవైసీ అనుమతి కోసం కేసీఆర్ ఎదురుచూస్తున్నారా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. 

జూబ్లీహిల్స్ వంటి ఖరీదైన ప్రాంతాల్లోనూ మహిళలకు భద్రత లేదన్న విషయం తాజా ఘటనతో వెల్లడైందని తెలిపారు. చెప్పుకుంటే ఇలాంటి ఘటనలు చాలానే ఉన్నాయని వ్యాఖ్యానించారు. నిందితులను సరిగా గుర్తించలేని విధంగా ఉన్న సీసీ కెమెరాల వల్ల ఉపయోగం ఏంటి? అని నిలదీశారు. 

"ఘటన జరిగిన వెంటనే పోలీసులు ఎందుకు చర్య తీసుకోలేదు? జాప్యానికి కారణం ఏంటి? వారు ఎవరిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు? పోలీసులు దాగుడుమూతలు ఆడడం మానేసి ఇకనైనా నిందితుల వివరాలను బహిర్గతం చేయాలి. వాళ్లు నిజంగానే మైనర్లా లేక ఈ వ్యవహారంలో వారి వివరాలను కప్పిపుచ్చేందుకు ప్రయత్నం జరుగుతోందా? అనేది ప్రజలకు తెలియాలి" అంటూ బండి సంజయ్ ఓ ప్రకటన విడుదల చేశారు.

More Telugu News