Sensex: నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

  • అమ్మకాల ఒత్తిడికి గురైన మార్కెట్లు
  • 49 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 43 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
Markets ends in losses

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఉదయం మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం వరకు లాభాల్లోనే ఉన్న మార్కెట్లు ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లోకి జారుకున్నాయి. ఈ క్రమంలో ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 49 పాయింట్లు నష్టపోయి 55,769కి పడిపోయింది. నిఫ్టీ 43 పాయింట్లు కోల్పోయి 16,584 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
రిలయన్స్ (2.02%), ఇన్ఫోసిస్ (0.94%), ఎల్ అండ్ టీ (0.85%), సన్ ఫార్మా (0.63%), టీసీఎస్ (0.46%). 

టాప్ లూజర్స్:
అల్ట్రాటెక్ సిమెంట్ (-5.49%), మారుతి (-2.71%), ఎన్టీపీసీ (-2.51%), యాక్సిస్ బ్యాంక్ (-2.18%), బజాజ్ ఫిన్ సర్వ్ (-2.09%).

More Telugu News