Jammu And Kashmir: క‌శ్మీర్ శాంతి భ‌ద్ర‌త‌ల‌పై అమిత్ షా కీల‌క భేటీ

  • క‌శ్మీర్‌లో పెరిగిన ఉగ్ర‌వాద దాడులు
  • రోజుకో హిందువు హ‌త్య‌కు గుర‌వుతున్న వైనం
  • అజిత్ దోవ‌ల్ స‌హా ప‌లువురు కీల‌క అధికారుల‌తో అమిత్ షా భేటీ
amit shah high level meeting on jammu and kashmir situation

జమ్మూ క‌శ్మీర్‌లో ప్ర‌స్తుతం శాంతి భ‌ద్ర‌త‌లు తీవ్ర ఆందోళ‌నకు గురి చేస్తున్నాయి. ఓ వైపు ఉగ్ర‌వాదుల దాడులు పెరిగిపోగా... మ‌రోవైపు రోజుకో హిందువు హ‌త్య‌కు గుర‌వుతున్నారు. ప్ర‌స్తుతం రాష్ట్రప‌తి పాల‌న‌లో ఉన్న క‌శ్మీర్‌లో ఈ ప‌రిస్థితుల‌కు కార‌ణం కేంద్ర ప్ర‌భుత్వ‌మేన‌న్న విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. విప‌క్షాల‌తో పాటు స్వ‌ప‌క్షం నుంచి కూడా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాపైకి విమ‌ర్శ‌లు వ‌చ్చి ప‌డుతున్నాయి. ఇలాంటి నేప‌థ్యంలో అమిత్ షా శుక్ర‌వారం ఓ కీల‌క భేటీని నిర్వ‌హించారు.

క‌శ్మీర్‌లోని ప‌రిస్థితుల‌పై అమిత్ షా ఉన్న‌త స్థాయి సమావేశాన్ని నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ దోవ‌ల్‌, జ‌మ్ము క‌శ్మీర్ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్‌, రా ఛీప్‌, ఆర్మీ చీఫ్ స‌హా ప‌లువురు ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు. క‌శ్మీర్‌లో జ‌రుగుతున్న ఘ‌ట‌న‌ల‌ను త‌క్ష‌ణ‌మే అణ‌చివేసేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అమిత్ షా ఈ సంద‌ర్భంగా అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. ఈ త‌ర‌హా ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌డానికి అస‌లు కార‌ణాలేమిట‌న్న దిశ‌గానూ ఈ భేటీలో చ‌ర్చ జ‌రిగిన‌ట్లు స‌మాచారం.

More Telugu News